హైదరాబాద్‌లోని బోరబండ GHMC కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీలత, రూ. లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. నివాస నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు ఆమె రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
బోరబండ GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత, ఒక వ్యక్తి నుండి నివాస నిర్మాణ అనుమతికి సంబంధించిన ఫైల్‌ను త్వరగా క్లియర్ చేసేందుకు రూ.5 లక్షల లంచం అడిగారు. ఈ క్రమంలో, ఆమె రూ. లక్ష అడ్వాన్స్‌గా తీసుకుంటుండగా ACB అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ACB అధికారులు శ్రీలతను అదుపులోకి తీసుకుని, ఆమెపై కేసు నమోదు చేశారు. లంచం నిర్మూలనలో భాగంగా ACB అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, అలాంటి చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని అధికారులు తెలిపారు.












