నాగిరెడ్డిపేట్, 3 September
కామారెడ్డి జిల్లా పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఒక దోపిడీ కేసును ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
36 గంటల్లో దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి దక్షిణ్ టైమ్స్ కామారెడ్డి జిల్లా పోలీసులు కేవలం 36 గంటల్లో దోపిడీ కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. న గోపాల్పేట్లోని దత్తు హాస్పిటల్ ఎదుట పొచమ్మర గ్రామానికి చెందిన దంపతులను ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి, బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు 12 తులాల వెండి గొలుసు, రూ.15 వేల నగదును తీసుకుని జూపిటర్ స్కూటీపై మెదక్ వైపు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సీఐ రాజారెడ్డి, ఎస్ఐ భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. విశ్వసనీయ సమాచార వనరుల సహకారంతో నిందితుల కదలికలను గుర్తించి, కేవలం 36 గంటల్లోనే వారి ఆచూకీ కనుగొన్నారు. న నిందితులు తిరిగి మండలం వైపు వస్తున్నారనే సమాచారంతో పోచారం చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 12 తులాల వెండి గొలుసు, రూ.15 వేల నగదు, నంబర్ ప్లేట్ లేని జూపిటర్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం గౌరవనీయ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును వేగంగా ఛేదించడంలో సీసీ కెమెరాల విశ్లేషణ, విశ్వసనీయ సమాచార వనరులు, పోలీసుల సమన్వయం కీలక పాత్ర పోషించాయని అధికారులు తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్ఐ భార్గవ్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.












