కామారెడ్డి, 9 September
జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సదాశివనగర్ సీఐ వీరయ్య కోరారు. పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ ఇంటిమేషన్ విధానం ద్వారా మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ మండపాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి: సీఐ వీరయ్య జిల్లా సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సదాశివనగర్ సీఐ వీరయ్య కోరారు. పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ ఇంటిమేషన్ విధానం ద్వారా మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు దరఖాస్తు అందజేయాలని సూచించారు. దీంతో భద్రతా ఏర్పాట్లు సులభతరం అవుతాయని, నమోదుకు ఎలాంటి రుసుము లేదన్నారు. మండపాలను ప్రజా రవాణా, అత్యవసర వాహనాలకు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ శాఖ అనుమతితోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకుల వివరాలు ప్రదర్శించి, వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. డీజేలకు పూర్తిగా నిషేధమని, పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లలో భక్తిగీతాలను మాత్రమే రాత్రి 10 గంటల వరకు వినియోగించాలని చెప్పారు. మద్యం, జూదం, అసభ్యకర కార్యక్రమాలు, రెచ్చగొట్టే నినాదాలు, టపాసులు నిషేధమని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, ఉత్సవాలను పోలీస్ శాఖ నిబంధనల మేరకు విజయవంతంగా నిర్వహించాలని సీఐ వీరయ్య విజ్ఞప్తి చేశారు.











