కడప నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న కడప బాలోత్సవం 4.0 - పిల్లల పండుగ పోస్టర్లను ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి ఆశయాలను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ తెలిపారు.
కడప: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న కడప బాలోత్సవం 4.0 - పిల్లల పండుగ పోస్టర్లను ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, పిల్లల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు, అసహజమైన పోటీతత్వాన్ని తగ్గించి, కులమత భేదాలు లేకుండా స్త్రీ పురుష సమానత్వం వంటి మంచి ఆశయాలను పెంపొందించేందుకు బాలోత్సవం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యారంగానికి అవసరమైన కో-కరికులర్ యాక్టివిటీస్‌తో కూడిన ఈ జిల్లా వ్యాప్తంగా పిల్లలు పాల్గొనడం సంతోషదాయకమని ఆమె అన్నారు.












