కామారెడ్డి పట్టణంలోని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార భద్రతా శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. అల్ సుభాన్ రెస్టారెంట్లో అనుమతిలేని కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించి, 15 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేశారు. అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా విప్పారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. అల్ సుభాన్ రెస్టారెంట్లో చికెన్ కూరలు, ఫ్రైడ్ రైస్ వంటి వంటకాల తయారీలో అనుమతిలేని కృత్రిమ రంగులు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వంటశాల అపరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, సిబ్బంది తల కవర్లు, చేతి తొడుగులు, ఏప్రాన్లు ధరించకపోవడం వంటి లోపాలను కూడా అధికారులు కనుగొన్నారు. మానవ వినియోగానికి పనికిరాని సుమారు 15 కిలోల నిల్వ ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.












