మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ.. ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒక ప్రాంతంలో జంతువులకు సోకే వ్యాధులు, పర్యావరణంలో వచ్చే మార్పులు చివరకు మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మూడింటినీ ఒకే వ్యవస్థలో భాగంగా పరిగణించి వ్యాధులను ముందుగానే గుర్తించి అరికట్టే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినే వన్ హెల్త్ (ఒకే ఆరోగ్యం) విధానంగా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వన్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మనుషులు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యాధుల నియంత్రణలో సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ.. ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒక ప్రాంతంలో జంతువులకు సోకే వ్యాధులు, పర్యావరణంలో వచ్చే మార్పులు చివరకు మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మూడింటినీ ఒకే వ్యవస్థలో భాగంగా పరిగణించి వ్యాధులను ముందుగానే గుర్తించి అరికట్టే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినే వన్ హెల్త్ (ఒకే ఆరోగ్యం) విధానంగా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వన్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మనుషులు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యాధుల నియంత్రణలో సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధుల ముప్పు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వెలుగులోకి వస్తున్న మానవ అంటువ్యాధుల్లో సుమారు 75 శాతం జంతువుల నుంచి వ్యాపించేవేనని అంచనాలు చెబుతున్నాయి. పశువులు, అడవి జంతువులు, పక్షులు, కీటకాలు, వాటి నివాస ప్రాంతాల్లో చోటుచేసుకునే మార్పులు అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత్‌లో పశుసంపద అధికంగా ఉండటం వల్ల ఈ అంశం మరింత కీలకంగా మారింది. దేశంలో సుమారు 140 కోట్ల జనాభాతో పాటు 53.6 కోట్ల పశుసంపద ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో పశువులకు వచ్చే వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆదాయం, పాల ఉత్పత్తి, ప్రజల పోషకాహారంపై ప్రభావం పడుతుంది. భారత్‌లో ఇటీవల పశువులను ప్రభావితం చేస్తున్న లంపీ స్కిన్ డిసీజ్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి పరిధిలోని జాతీయ పశువ్యాధుల రోగ నిర్ధారణ, ఎపిడెమియాలజీ సంస్థ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సెప్టెంబర్‌లో విడుదల చేసిన అంచనాల ప్రకారం, దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 219 జిల్లాలకు ఈ వ్యాధి ముప్పు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని పది తూర్పు జిల్లాల్లో సెప్టెంబర్ మధ్య నాటికి 10,400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా మనుషులకు సోకకపోయినా పశువుల పాల ఉత్పత్తి తగ్గడం, రైతుల ఆదాయం దెబ్బతినడం, గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 202223లో దేశవ్యాప్తంగా లంపీ స్కిన్ వ్యాధి కారణంగా 1.6 లక్షలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.












