భారతదేశంలో బందీలుగా ఉన్న ఏనుగులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించే విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏనుగుల తరలింపు ప్రక్రియలో నిబంధనలను పాటించకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తింది. దాదాపు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైకి ఒక ఏనుగును కేవలం తొమ్మిది రోజుల్లో తరలించడంపై ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ అంశంపై పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బందీ ఏనుగుల అంతర్రాష్ట్ర బదిలీకి అనుసరించిన విధానాన్ని సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
50 రోజుల ప్రక్రియను తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేశారా
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. పర్యావరణ చట్టాల ప్రకారం బందీ ఏనుగులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించాలంటే పలు దశల్లో తనిఖీలు, అనుమతులు, సంబంధిత అధికారుల సంప్రదింపులు అవసరమని తెలిపారు. ఈ ప్రక్రియ సాధారణంగా కనీసం 50 రోజుల సమయం తీసుకుంటుందని వివరించారు.












