ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య సోనమ్ (30)ను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు భర్త సుఖ్బీర్ సింగ్ అలియాస్ మోను. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. మంటలను ఆర్పేందుకు గంటన్నర సమయం పట్టింది.
జగత్పూర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు తన ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తెతో కలిసి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానిక యువకుడితో భార్య ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానంతో దంపతుల మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.












