సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అక్కడ త్వరగా విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేసింది.
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఈ కేసులో ముందుగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే పిటిషన్‌ను అక్కడ త్వరగా విచారించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. ఆజంఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించగా, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై నేరుగా విచారణ చేపట్టడం కంటే సంబంధిత హైకోర్టును ఆశ్రయించడమే సరైన మార్గమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ రెండు రోజుల్లో పిటిషన్ అసలు రికార్డులను అలహాబాద్ హైకోర్టుకు పంపాలని ఆదేశించింది. ఒక డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. అవసరమైతే పిటిషన్లో మార్పులు చేసుకోవడంతోపాటు అదనపు పత్రాలు సమర్పించుకోవచ్చని ఆజంఖాన్‌కు వెసులుబాటు కల్పించింది.












