భారతదేశంలో పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే కార్యక్రమానికి ఈ ఏడాది ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవన వర్షపాతం తగ్గడం, మొక్కజొన్న, చెరకు పంటల దిగుబడి దెబ్బతినడంతో ఇంధన ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల కొరత ఏర్పడుతోంది. దీంతో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20 శాతం లక్ష్యం నుంచి 1517 శాతానికి తగ్గించే పరిస్థితి రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే 20 లక్ష్యాన్ని నిర్ణయించింది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ఆ లక్ష్యానికి అడ్డంకిగా మారుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో దేశంలో సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో మొక్కజొన్న, చెరకు పంటల దిగుబడిపై ప్రభావం పడింది. మొక్కజొన్న, చక్కెర ధరలు సుమారు 40 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరగా, బియ్యం ధరలు కూడా 20 శాతం పెరిగాయి.












