జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ నేషనల్ కాన్ఫరెన్స్ () పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించారు. పార్టీ నాయకత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశంపై పార్టీ తన వైఖరిని మార్చుకుందని ఆయన విమర్శించారు. బద్గామ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రుహుల్లా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన తండ్రి అగా సయ్యద్ మెహదీ 26వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ సభలో, పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై ఆయన విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై ప్రజలకు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పార్టీ విఫలమైందని రుహుల్లా ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన పార్టీ, బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.












