దేశంలో నక్సలిజం అంతానికి గుర్తుగా 2026 జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వెల్లడించారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్లో జరిగే ఈ కార్యక్రమంలో నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొననున్నారు. ప్రధానమంత్రి సమక్షంలో ఈ పరేడ్ జరగనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2019 నుంచి ఏక్తా నగర్లో జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గోవింద్ మోహన్ వివరించారు. పరేడ్‌తో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.












