ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని అవినాష్ మాగ్నెటో మాల్లో 20 అడుగుల ఎత్తులో 2.5 లక్షల ముత్యాలతో అద్భుతమైన హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీపావళి వేడుకల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన 20 అడుగుల హనుమంతుడి విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 2.5 లక్షల ముత్యాలను ఉపయోగించి రూపొందించిన ఈ ప్రత్యేక కళాకృతి దీపావళి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విగ్రహాన్ని చూసేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాయ్‌పూర్‌లోని అవినాష్ మాగ్నెటో మాల్లో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముత్యాలను ఉపయోగించి అత్యంత నైపుణ్యంతో దీనిని రూపొందించారు. ఈ కళాకృతిని తయారు చేసేందుకు కళాకారులకు సుమారు 300 గంటల సమయం పట్టినట్లు మాల్ నిర్వాహకులు వెల్లడించారు.












