జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు 31వ విడతగా రూ.35,24,537 విలువైన చెక్కులను అందజేశారు.
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్రంలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడం గమనార్హం.











