చిత్తూరు పట్టణంలో ఇకపై ధర్నాలు, నిరసనలు కేవలం గంగినేని చెరువు వద్ద నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే నిర్వహించాలని సబ్-డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు.
చిత్తూరు పట్టణంలో ఇకపై నిర్దేశిత ప్రదేశంలో మాత్రమే ధర్నాలు నిర్వహించాలని చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ స్పష్టం చేశారు. గంగినేని చెరువు వద్ద అమ్మవారి ఆలయం పక్కన నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే ధర్నాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.












