రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, బెదిరింపులు, ప్రలోభాలు ఉన్నా ప్రజలు తమ పార్టీకి అండగా నిలిచారని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో కోర్టు అనుమతితో నామినేషన్లు వేసి 4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. మరికొన్ని స్థానాలు స్వల్ప మెజారిటీతో చేజారాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రశాంతంగా జరగాల్సిన రాజంపేట ఎన్నికల్లో గంజాయి బ్యాచ్‌తో బెదిరింపులకు పాల్పడ్డారని, అధికారులతో కుమ్మక్కై నామినేషన్లు చింపేశారని, తిరస్కరించారని ఆయన ఆరోపించారు. అయినా అన్ని కుట్రలను ఛేదించి పార్టీ విజయం సాధించిందన్నారు.











