రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాజంపేటలోని జడ్పీహెచ్ఎస్ మన్నూరు పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఎన్నికల విధులు పొందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల విధులు పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని సూచించారు. ఓటింగ్‌కు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా ఎన్నికల విధుల ఆర్డర్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాలని అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ సూచించారు.











