మణుగూరులోని చేపల మార్కెట్ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు కాంగ్రెస్ నాయకుల చొరవతో పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
బ్యూరో, మణుగూరు, నవంబర్ 2 బ్యూరో, మణుగూరు, నవంబర్ 2: పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు చేపల మార్కెట్ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆదివారం చేపల మార్కెట్ ప్రాంతంలో పర్యటించిన మణుగూరు కాంగ్రెస్ నాయకులు స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి డ్రైనేజీ వ్యవస్థ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.












