మండలంలో జరగబోవు సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్, మండల ఎంపీడీవో, తాసిల్దార్, పోలీస్ అధికారికి వైయస్సార్సీపీ నాయకులు, అధ్యక్షులు మని రాజు ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుత నిబంధనలు దౌర్జన్యాలకు, రౌడీయిజానికి దారితీస్తాయని వారు ఆరోపించారు.
గతంలో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు మూడు పంచాయతీలు కలిసి ఒకేచోట వేసేవారని, గడికోట, గుర్రప్ప గారి పల్లె, పంచాయతీలకు కలిపి ఎంపీడీవో కార్యాలయంలో, వంగమల్ల, దిగువ రాచపల్లి, సోమవారం పంచాయతీలకు కలిపి వంగమాల సచివాలయంలో, సంఘం వాళ్ళ పల్లె, పెద్ది వీడు, మట్లి పంచాయతీలకు కలిపి పెద్దవీడు సచివాలయంలో, సానేపాయి, ఓదివీడు, తాటికుంటపల్లె పంచాయతీలకు కలిపి ఓదివీడు సచివాలయంలో నామినేషన్లు స్వీకరించేవారని వైయస్సార్సీపీ నాయకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుత నిబంధనలపై అభ్యంతరం











