కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అశోక్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు మళ్లీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదిత బ్రిడ్జి ప్రాంతంలో సర్వే నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అశోక్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదిత బ్రిడ్జి ప్రాంతంలో సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అశోక్‌నగర్ రైల్వే గేట్ తరచూ మూసివేయబడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.










