రైస్‌మిల్లుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకుని నిధులను మళ్లించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసు కల్లం మోడర్న్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర సంస్థలకు సంబంధించినదిగా ఈడీ వెల్లడించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం ఎస్బీఐలో విలీనం) గుంటూరులోని అరండల్‌పేట శాఖ నుంచి 20102013 మధ్య ఈ సంస్థలు రూ.24.57 కోట్ల రుణ సదుపాయాలు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రుణాలకు హామీగా సమర్పించిన ఆస్తి పత్రాలు నకిలీవని, రుణాల ద్వారా పొందిన మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించారని ఈడీ ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.18.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
26 సంస్థల పేర్లతో కార్యకలాపాలు
కల్లం పేరి రెడ్డి తన బంధువులు, ఉద్యోగులు, అనుబంధ వ్యక్తుల పేర్లపై సుమారు 26 సంస్థలను నిర్వహించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించిందని తెలిపింది. వీటిలో రుణాలు పొందిన మూడు సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొంది.











