తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీకి ఏటీఎం కార్డుగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంలా మారిందని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
420 హామీల అమలు ఏది
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, 13 ప్రకటనల్లో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నాయకత్వం చెప్పిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులకు పైగా గడిచినా హామీల అమలుపై స్పష్టత లేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, మైనారిటీలు సహా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో రాహుల్ గాంధీ వివరించాలని ప్రశ్నించారు.











