ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రజాక్‌ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శనివారం సస్పెండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తుపాను వంటి అత్యవసర పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చలో విజయవాడ పేరుతో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ చర్యలు ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1964లోని రూల్ నంబర్ 3కు విరుద్ధమని పేర్కొంటూ రజాక్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో అందరు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాల్సి ఉందని, అలాంటి సమయంలో ఇలాంటి పిలుపునివ్వడం క్రమశిక్షణారాహిత్యమని అధికారులు భావిస్తున్నారు.












