స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, దేశసేవకు, ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు.












