ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తీవ్రత పెరుగుతోందని, రాష్ట్రం మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, కరువు నివారణ చర్యలపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, నవంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, నవంబర్ 3: ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలోనూ కరువు తీవ్రత పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాజకీయంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మానేసి, కరువు పరిస్థితుల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే దానిపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కరువును కేవలం కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే బియ్యం ధరలు, తాగునీటి ట్యాంకర్ల ధరలు పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.












