కడప జిల్లా మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఘటనలో విద్యుత్ శాఖ లైన్ మెన్ షౌకత్ అలీ, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి తల్లి, కొడుకులపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
రాజంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు ఇనోవా కారులో వచ్చి హల్ చల్ చేస్తూ వీరంగం సృష్టించారు. ఇంటి బయట కూర్చుని ఉన్న మాబున్ని (40) అనే మహిళను, రాయచోటిలో విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్న షౌకత్ అలీ అనే వ్యక్తి అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. తన తల్లిపై దాడి జరుగుతుండగా అడ్డుకోబోయిన ఆమె కుమారుడు, డిగ్రీ విద్యార్థి అయిన మహమ్మద్ ఆకిబ్ (19) పై షౌకత్ అలీ కత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తీవ్ర భయభ్రాంతులకు గురైన తల్లికొడుకులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో స్థానికులను చూసి నిందితులు అక్కడి నుంచి ఇనోవా కారులో పరారీ అయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి, కొడుకులు మాబున్ని, మహమ్మద్ ఆకిబ్ లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












