కడప నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ ఖరారైతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కూకట్లపల్లి బాబు (కే. బాబు) పేరు ప్రముఖంగా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రకాశ్‌నగర్‌కు చెందిన కే. బాబు 2002లో కొత్తమద్ది సురేష్ బాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ యువజన విభాగంలో, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షుడిగా, జిల్లా ఫుడ్ కమిటీ సభ్యుడిగా పనిచేసి నగర రాజకీయంలో తనదైన ముద్ర వేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2005లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీతో కలిసి పనిచేశారు. 2014, 2019 మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి, వరుసగా 1,320, 1,270 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు.











