ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీ క్యాడర్ తో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ, మండలాలలో విజయం సాధించాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో కార్యకర్తలకు నూతన ఉత్తేజం కలిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ బలోపేతానికి, రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి శాయశక్తులా పనిచేస్తామని క్యాడర్ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










