తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతున్న నేపథ్యంలో, ఈసారి దీపావళి పండుగను లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తన సందేశాన్ని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటానని సీఎం తెలిపారు.
సొంతింటి కల సాకారమైన వేళ లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ సంతోషాన్ని పంచుకోవడం తనకు ఆనందంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దీపావళి సందర్భంగా తాను ఒక ఇందిరమ్మ ఇంటికి వెళ్లి, అక్కడి లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రవ్యాప్త కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేసి, దీపావళి రోజున ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. పేద కుటుంబాల సొంతింటి సంతోషంలో భాగస్వాములు కావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.











