ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడిగి గెలిచే ధైర్యం లేక పోలీసులను, అధికారులను, రౌడీలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు ప్రజాస్వామ్య విజయమంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నించేలా ఉన్నాయని ఆరోపించారు. బుధవారం ఖాజీపేటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడిగి గెలిచే ధైర్యం లేక పోలీసులను, అధికారులను, రౌడీలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు ప్రజాస్వామ్య విజయమంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నించేలా ఉన్నాయని ఆరోపించారు. బుధవారం ఖాజీపేటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ల దశ నుంచే అధికార దుర్వినియోగానికి తెరలేపారని రెడ్యం ఆరోపించారు. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్లు దాఖలు చేయకుండా భౌతికంగా నిరోధించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. కొన్నిచోట్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లను తిరస్కరించేలా చేశారని ఆరోపించారు. ప్రజలు తమ ఓటుతో నిర్ణయించాల్సిన ఎన్నికలను ఇలా అడ్డంకులతో ఏకపక్షంగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ వేయనివ్వకుండా చేసి.. ప్రత్యర్థి లేకుండా గెలిచి.. దానిని ప్రజల తీర్పుగా ఎలా చెప్పుకుంటారు అని రెడ్యం ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకత ఉందనే భయంతోనే కూటమి నేతలు ప్రత్యర్థి అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవకుండా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఫలితాలను చూపించి వైఎస్సార్సీపీ బలహీనపడిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ జగన్ రాజకీయంగా ముగిసిపోయారని కూటమి నేతలు చేస్తున్న ప్రచారం పగటి కలేనని రెడ్యం అన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి ఉంటే ఆయనపై వ్యక్తిగత విమర్శలు, పాత కేసులు, కుటుంబ వివాదాలనే పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణను చూసే ఆయనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.











